: కంచ ఐలయ్యకు తక్షణం ప్రభుత్వం రక్షణ కల్పించాలి: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ


తమ సామాజిక వర్గాన్ని కించపరిచారంటూ రిటైర్డ్ ఫ్రొఫెసర్ కంచ ఐలయ్యపై ఆర్యవైశ్యులు మండిపడుతున్న విషయం తెలిసిందే. తనను హతమారుస్తామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పోలీసులకు ఆయన ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ, కంచ ఐలయ్యకు తక్షణం తగిన భద్రత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు.

బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, బెంగళూరుకు చెందిన మహిళా జర్నలిస్ట్ గౌరీ లంకేష్ ను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చినట్టే తనను కూడా హతమారుస్తారంటూ కంచ ఐలయ్య ఆందోళన వ్యక్తం చేశారు. బెదిరింపు కాల్స్ వచ్చిన ఫోన్ నంబర్లను పోలీసులకు తెలియజేసిన ఆయన, వారిని అరెస్ట్ చేయాలని కోరారు.  

  • Loading...

More Telugu News