: బంగ్లాదేశ్ కు 15 రోజుల్లో మూడు లక్షల మంది రోహింగ్యా ముస్లింలు!


మయన్మార్‌లో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా కేవలం 15 రోజుల్లో ఏకంగా 3 లక్షల మంది రోహింగ్యా ముస్లింలు దేశాన్ని విడిచి వెళ్లినట్టు ఐక్య రాజ్యసమితి పేర్కొంది. దేశంలోని రఖినె రాష్ట్రంలో రోహింగ్యా మిలిటెంట్లు, ప్రభుత్వ దళాలకు మధ్య జరుగుతున్న పోరులో వీరంతా దేశాన్ని విడిచినట్టు ఐరాస తెలిపింది. మయన్మార్‌ను విడిచిపెట్టిన వీరంతా బంగ్లాదేశ్‌లో తలదాచుకుంటున్నట్టు వివరించింది. వారందరికీ సరిపడా క్యాంపులు ఉన్నట్టు తెలిపింది. అయితే తలదాచుకునేందుకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో రిలీఫ్ ఏజెన్సీలపై విపరీతమైన ఒత్తిడి ఉన్నట్టు ఐరాస ప్రతినిధులు తెలిపారు.

  • Loading...

More Telugu News