ఎన్టీఆర్ అన్నీ తానై 'జై లవకుశ'ను నడిపించాడట!
ఈ సినిమాకి దర్శకుడు బాబీ అని తెలిసిందే .. అయితే అవుట్ పుట్ విషయంలో పూర్తి సంతృప్తి కోసం ఎన్టీఆర్ దర్శకత్వ పర్యవేక్షణ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. అదే విధంగా గ్రాఫిక్స్ విషయంలోను ఆయన పర్యవేక్షణ ఉందట. సినిమా ఫలితం ఏదైనా అందుకు తాను పూర్తి బాధ్యతను వహించేంతగా ఆయన కెమెరా వెనుక కూడా చొరవ చూపించాడని అంటున్నారు. అన్నీ తానై ఆయన ఈ సినిమాను పూర్తి చేశాడని చెబుతున్నారు. ఇందులో వాస్తవమెంతో గాని .. ఇప్పుడంతా ఈ విషయాన్ని గురించే మాట్లాడుకుంటున్నారు.