: టీ20 అప్ డేట్స్: టీమిండియా విజయ లక్ష్యం 171 పరుగులు!
కొలంబో వేదికగా జరుగుతున్న టీ20 మ్యాచ్ లో నిర్ణీత 20 ఓవర్లలో శ్రీలంక జట్టు 7 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. దీంతో, టీమిండియా విజయ లక్ష్యం 171 పరుగులుగా శ్రీలంక నిర్దేశించింది.
శ్రీలంక బ్యాటింగ్ : డిక్ వెల్లా (17), తరంగ (5), మునవీర్ (53), మ్యాథ్యూస్ (7), పెరెరా (11)శనాఖా (0), ప్రసన్నా (11), ప్రియాంజన్ 41 పరుగులతో, ఉడానా 19 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.
భారత్ బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ -1, బుమ్రా -1, చాహల్ -3, కులదీప్ యాదవ్ -2