టైటిల్ 'తొలి ప్రేమ' అయినా పవన్ మూవీతో పోలిక ఉండదట!

వరుస పరాజయాలతో డీలాపడిన వరుణ్ తేజ్ కి 'ఫిదా' హిట్ కొత్త ఉత్సాహాన్నిచ్చింది. దాంతో ఆయన మరింత జోష్ తో తదుపరి సినిమా షూటింగులో పాల్గొంటున్నాడు. వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవలే ఒక షెడ్యూల్ షూటింగును పూర్తి చేసుకున్న ఈ సినిమా, రెండవ షెడ్యూల్ కోసం లండన్ వెళ్లనుంది.

 ఈ సినిమాకి 'తొలిప్రేమ' అనే టైటిల్ ను ఫిక్స్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. దాంతో ఇది పవన్ 'తొలిప్రేమ'కి రీమేక్ అయ్యుంటుందని కొంతమంది .. సీక్వెల్ అయ్యుంటుందని మరికొంతమంది అనుకున్నారు. ఇదంతా కేవలం ప్రచారం మాత్రమేననీ, ఇందులో ఎంతమాత్రం నిజం లేదనేది తాజా సమాచారం. టైటిల్ 'తొలిప్రేమ' అయినప్పటికీ, పవన్ సినిమాకి .. వరుణ్ తేజ్ మూవీకి ఎలాంటి పోలిక ఉండదని చెబుతున్నారు. వరుణ్ తేజ్ జోడీగా రాశి ఖన్నా నటిస్తోన్న సంగతి తెలిసిందే. 
Go Back to Shorts
varun tej
rasikhanna

More Telugu News