: మన ప్రత్యర్థి ప్రపంచంలోనే బెస్ట్ అయినప్పుడు ఓటమి భయం అక్కర్లేదు: సింధుతో బ్యాడ్మింటన్ ఆడిన సోనూ సూద్
ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుతో కలసి బ్యాడ్మింటన్ ఆడాడు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేస్తూ ‘మన ప్రత్యర్థి ప్రపంచంలోనే బెస్ట్ అయినప్పుడు ఓటమి గురించి భయమక్కర్లేదు. మమ్మల్ని గర్వపడేలా చేసినందుకు ధన్యవాదాలు సింధు’ అంటూ ట్వీట్ చేశాడు. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో సింధు రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా సింధు జీవిత విశేషాలతో సోనూ సూద్ బయోపిక్ ను నిర్మిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బయోపిక్ నటీనటుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని సోనూ సూద్ తెలిపాడు.