బాబుకు అందని ఆహ్వానం.. స్పీకర్ దృష్టికి తీసుకెళ్ళనున్న టీడీపీ
పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఆహ్వానించకపోవడంపై లోక్ సభ స్పీకర్ ను కలవాలని పార్టీ ఎంపీలు నిర్ణయించుకున్నారు. పార్లమెంటు ఆవరణలో ఎల్లుండి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో రేపు లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ ను ఎంపీ నామా నాగేశ్వరరావు నేతృత్వంలో టీడీపీ ఎంపీలు కలవనున్నారు. స్పీకర్ తో భేటీలో బాబుకు అందని ఆహ్వానం విషయాన్ని చర్చించనున్నారు.