: దయచేసి ఎవరూ ఆత్మహత్యకు పాల్పడవద్దు: కీర్తి సురేష్
నీట్ పరీక్షకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన తమిళనాడు విద్యార్థిని అనిత (17) ఆత్మహత్యకు పాల్పడటంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థి లోకం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనిత సొంత జిల్లాలో స్వచ్ఛందంగా బంద్ పాటించారు.
అనిత మృతికి సంతాపం తెలుపుతూ తలైవా రజనీకాంత్, హీరో శివకార్తికేయన్ తదితరులు ట్వీట్లు చేయగా, కీర్తి సురేష్ విద్యార్థి లోకానికి సూచన చేసింది. అనిత మృతి బాధాకరమని పేర్కొని, ఒక మంచి విద్యార్థినిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేసింది. సమస్యలకు ఆత్మహత్య ఎంత మాత్రమూ పరిష్కారం కాదని స్పష్టం చేసింది. దయచేసి ఎవరూ ఆత్మహత్యకు పాల్పడవద్దని కోరింది.