: జ‌గ‌న్ పొర్లుదండాల యాత్ర చేసినా ప్రజలు ఆయనను నమ్మరు: బోండా ఉమా


నంద్యాల, కాకినాడ ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌య‌భేరీ మోగించింద‌ని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్ర‌జ‌లు న‌మ్మడం లేద‌ని టీడీపీ నేత బోండా ఉమామ‌హేశ్వ‌రావు అన్నారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... ఏపీని పాలించే అర్హ‌త ఒక్క చంద్ర‌బాబు నాయుడికే ఉంద‌ని అన్నారు. చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రాభివృద్ధి కోసం ఎంతో శ్ర‌మిస్తున్నార‌ని అన్నారు. ఇక నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఏ ఎన్నికైనా త‌మ పార్టీనే ఏక పక్షంగా విజ‌యం సాధిస్తుందని ధీమా వ్య‌క్తం చేశారు. జ‌గ‌న్ పొర్లు దండాల యాత్ర చేసినా ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితిలో లేర‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News