: 25 ఏళ్ల తరువాత కాకినాడపై ఎగిరిన టీడీపీ జెండా... హాఫ్ మార్క్ దాటిన డివిజన్లు!
రెండు పుష్కరాల తరువాత కాకినాడపై తెలుగుదేశం జెండా రెపరెపలాడే సమయం వచ్చింది. 1985లో కాకినాడ మునిసిపాలిటీగా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ అక్కడ గెలిచింది. టీడీపీ పార్టీ ప్రారంభమైన తరువాత కాకినాడకు జరిగిన తొలి ఎన్నికల్లో మాత్రమే ఆ పార్టీ జయకేతనం ఎగురవేసింది. ఆపై మరెన్నడూ ఇక్కడ టీడీపీ గెలవలేదు. కాంగ్రెస్ పార్టీయే కాకినాడను ఏలుతూ వచ్చింది.
తిరిగి ఇన్ని సంవత్సరాల తరువాత ఇప్పుడు కాకినాడ తమకు దక్కడంపై తెలుగుదేశం నేతలు ఆనందోత్సాహాలతో ఉన్నారు. మొత్తం 48 డివిజన్లు ఇక్కడ ఉండగా, హాఫ్ మార్క్ ఫిగర్ ను దాటేసింది. ఇప్పటికే టీడీపీ 25 డివిజన్లను సాధించింది (గెలుపు ప్లస్ ఆధిక్యం). వైకాపా 6 డివిజన్లకే పరిమితమైంది. మరో 17 డివిజన్ల కౌంటింగ్ జరగాల్సి వుంది. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పాలనలో ఉన్న కాకినాడ, ఈ ఎన్నికల్లో టీడీపీ అభివృద్ధి నినాదానికి పట్టం కట్టింది.