హారర్ మూవీగా 'భీముడు' .. హీరోగా నారా రోహిత్!

'చంద్రముఖి' సినిమా నుంచి తెలుగులో హారర్ కథల హవా కొనసాగుతూనే వుంది. కాస్త కామెడీని .. మరికాస్త సస్పెన్స్ ను తోడు చేసుకుని హారర్ చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. దాంతో చాలామంది హీరోలు .. హీరోయిన్లు ఈ తరహా కథల్లో నటించడానికి ఆసక్తిని చూపుతున్నారు. అలాంటి కథానాయకుల జాబితాలో తాజాగా నారా రోహిత్ కూడా చేరిపోయాడు.

 'భీముడు' అనే హారర్ మూవీని చేయడానికి ఆయన రెడీ అవుతున్నాడు. గతంలో నారా రోహిత్ తో 'సావిత్రి' సినిమా చేసిన పవన్ సాదినేని, ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. భయపెట్టే 'భీముడు'గా ఆయన నారా రోహిత్ ను చూపించనున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ కథ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ లోగా నారా రోహిత్ సినిమాలు 'కథలో రాజకుమారి' .. 'బాలకృష్ణుడు' ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తాయి.  
Go Back to Shorts
nara rohith

More Telugu News