: కాకినాడలో ముసురు.. ఓటేసేందుకు ఇంకా కదలని ప్రజలు!

కాకినాడ నగర పాలక సంస్థకు ఈ ఉదయం ప్రారంభమైన పోలింగ్ మందకొడిగా సాగుతోంది. పూర్తిగా ముసురు పట్టిన వాతావరణంతో పాటు చిరు జల్లులు పడుతూ ఉండటంతో నగర ఓటరు ఇంకా ఇల్లు దాటలేదు. చాలా చోట్ల ఓటేసేందుకు అతి తక్కువ మంది ఓటర్లు మాత్రమే క్యూలైన్లలో కనిపిస్తున్నారు. పోలింగ్ ప్రారంభమై రెండు గంటలు దాటినా అత్యధిక కేంద్రాల్లో కనీసం 10 శాతం పోలింగ్ కూడా నమోదుకాని పరిస్థితి నెలకొంది. ఓటు వేసేందుకు ప్రజలు ముందుకు రాని పరిస్థితిని చూసి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. నేడంతా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండటం వారిని మరింత ఆందోళనలోకి నెడుతోంది. మొత్తం 196 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయగా, 241 మంది అభ్యర్థులు ఓటర్ల తీర్పును కోరుతున్నారు. టీడీపీ-బీజేపీ కూటమికి వైకాపాకు మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉండగా, ఇరు పార్టీలకూ పలు చోట్ల రెబల్స్ బెడద ఉంది.

More Telugu News