ముఖ్యమంత్రి పళనిస్వామికి షాక్.. పార్టీ జిల్లా కార్యదర్శి పదవి నుంచి తొలగించిన దినకరన్.. డీఎంకేతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు యత్నాలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముఖ్యమంత్రి పళనిస్వామికి షాక్.. పార్టీ జిల్లా కార్యదర్శి పదవి నుంచి తొలగించిన దినకరన్.. డీఎంకేతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు యత్నాలు!

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి టీటీవీ దినకరన్ ఝలక్కిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడి పదవి నుంచి ఆదివారం ఆయనను తప్పించారు. అంతేకాక పళని, పన్నీర్ వర్గానికి చెందిన పలువురిని తప్పించి వారి స్థానంలో తన మద్దతుదారులను వివిధ పదవుల్లో నియమించారు. దినకరన్ ఆదేశాలపై పళని, పన్నీర్ వర్గాలు స్పందించాయి. పార్టీ కార్యకలాపాల్లో తలదూర్చే ఎటువంటి అధికారం అతడికి లేదని తేల్చి చెప్పాయి. ఆయన ఆదేశాలు చెల్లవని పేర్కొన్నాయి.

కాగా, మరోవైపు దినకరన్ వైపు చేరుతున్న ఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో పళని, పన్నీర్ వర్గాల్లో గుబులు రేగుతోంది. ఇంకోవైపు ప్రతిపక్ష డీఎంకేతో కలిసి దినకరన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారని, ఈ మేరకు డీఎంకే, దినకరన్ మధ్య ఒప్పందం జరిగినట్టు సీనియర్ అడ్వొకేట్ సుబ్రహ్మణ్యస్వామి చెప్పడంతో తమిళ రాజకీయాలు మరోమారు వేడెక్కాయి.

More Telugu News