: యాంకర్ గానే గుర్తింపు... సినిమాలు ఆపైనే: అనసూయ
తనకు టీవీ యాంకర్ గానే గుర్తింపు వచ్చిందని, సినిమా అవకాశాలు ఆపైనే దక్కాయని నటి అనసూయ చెప్పింది. శ్రీశైల మల్లికార్జునుడిని దర్శించుకునేందుకు వచ్చిన ఆమె, మీడియాతో మాట్లాడుతూ, జబర్దస్త్ తోనే తనకు మంచి గుర్తింపు వచ్చిందని, ఆపై పలు చిత్రాల్లో మంచి అవకాశాలు లభించాయని చెప్పుకొచ్చింది. మల్లన్నకు రుద్రాభిషేకం, ఆపై భ్రమరాంబకు కుంకుమార్చన జరిపించిన అనసూయ, సినిమాలు, సీరియల్స్ తనకు బోనస్ అని, యాంకర్ గానే ప్రేక్షకులకు దగ్గరయ్యానని వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో తనకెంతో మంది అభిమానులు ఉన్నారని చెప్పింది. కాగా, అనసూయను చూసిన అభిమానులు, భక్తులు ఆమెతో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. అనసూయ సైతం తన అభిమానులతో కాసేపు సరదాగా గడిపారు.