: హైదరాబాద్ ధరణీ కాలనీని ముంచెత్తుతున్న కాలుష్య నురగ
రాత్రి భారీగా కురిసిన వర్షానికి హైదరాబాద్‌లోని ధరణీ కాలనీలోని నాలా నుంచి పెద్ద ఎత్తున నురగ వెలువడుతోంది. దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుకు అడ్డంగా నురగ పొంగుతుండటంతో కాలనీలో స్థానికులు అందులో చిక్కుకుపోతున్నారు. నురగలో ఉన్న రసాయనాల కారణంగా దుర్వాసనతో పాటు చిన్నపిల్లలకు ఎలర్జీలు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.
గత రెండేళ్ల నుంచి ఎప్పటికప్పుడు ఈ నురగ సమస్య పునరావృతం అవుతున్నప్పటికీ జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. ప్రస్తుతం రోడ్డు మీద ఉన్న నురగను శుభ్రం చేసేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రయత్నిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు బెంగళూరులో కూడా ఇలాంటి సమస్యే తలెత్తిన సంగతి తెలిసిందే.