Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!

*  భారతీయ సినిమాలలో తన పాత్రలకు చాలా పరిమితులు వున్నాయి.. అంటోంది బ్రిటిష్ బ్యూటీ ఎమీ జాక్సన్. "ఓ పల్లెటూరి పిల్ల పాత్రను నాకు ఎవరూ ఆఫర్ చేయరు. అలాంటి పాత్రల్లో దర్శకులు నన్ను ఊహించలేరు. నేను విదేశీ అమ్మాయిని కాబట్టి అందుకు తగ్గా మోడరన్ పాత్రలనే ఇస్తారు. అందుకే, నా పాత్రలకు లిమిటేషన్స్ వున్నాయి" అని చెప్పింది ఎమీ జాక్సన్.
*  పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను వచ్చే నెల 2న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు అధికారికంగా ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు. పవన్ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ రెండున విడుదల చేస్తామని పేర్కొన్నారు.
*  'జయ జానకి నాయక' చిత్రం తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన తదుపరి చిత్రాన్ని శ్రీవాస్ దర్శకత్వంలో చేయనున్న సంగతి విదితమే. ఈ సినిమా షూటింగును త్వరలో తమిళనాడులోని పొల్లాచ్చిలో నిర్వహించనున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.
*  సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన 'ప్రాజక్ట్ జడ్' పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే నెల రెండో వారంలో దీనిని విడుదల చేస్తారు. నలభై ఏళ్ల క్రితం మనుషులు ఎలా వున్నారు? రాబోయే నలభై ఏళ్లలో ఎలా వుంటారు? అన్న కథాంశంతో దీనిని రూపొందిస్తున్నారు.        
Amy jackson

More Telugu News