Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'కృష్ణార్జున యుద్ధం' కోసం యూరప్ వెళుతోన్న నాని!

ఒక వైపున 'మిడిల్ క్లాస్ అబ్బాయి'ని సాధ్యమైనంత త్వరగా ప్రేక్షకులకు పరిచయం చేయాలని చూస్తోన్న నాని, మరో వైపున 'కృష్ణార్జున యుద్ధం' సినిమా షూటింగులో పాల్గొంటున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా, కొన్ని రోజులుగా 'పొల్లాచ్చి'లో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు.

 రేపటితో ఈ షెడ్యూల్ పూర్తవుతోంది. తదుపరి షెడ్యూల్ ను యూరప్ లో ప్లాన్ చేశారు. వచ్చేనెల 10వ తేదీ నుంచి ఈ షెడ్యూల్ మొదలుకానుంది. కథానాయిక అనుపమ పరమేశ్వరన్ ఈ షెడ్యూల్ లో జాయిన్ అవుతుంది. కృష్ణ - అర్జున్ గా నాని ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అందువలన ఈ సినిమాలో మరో కథానాయిక కూడా సందడి చేయనుంది.   
nani
anupama

More Telugu News