రాజమౌళి తరహాలోనే గోప్యత పాటించనున్న 'సైరా' టీమ్!
ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నవారు సైతం ఈ సినిమాలో తమ పాత్రల తీరు తెన్నులకి సంబంధించిన వివరాలను గోప్యంగా వుంచవలసిందే. 'బాహుబలి' విషయంలో రాజమౌళి ఇదే పద్ధతిని పాటిస్తూ వచ్చారు. ఆయా పాత్రధారులకి సంబంధించిన ఒక్కో లుక్ ను ఆయన రిలీజ్ చేసే వరకూ ఎవరెవరు ఏం చేస్తున్నారన్నది ఎవరికీ తెలియదు. అదే పద్ధతిని పాటిస్తూ .. ఈ ప్రాజెక్టుపై ఆసక్తిని పెంచాలనే నిర్ణయానికి 'సైరా' టీమ్ వచ్చిందనే టాక్ వినిపిస్తోంది.