అఖిల్ మూవీ థియేటర్లకి వచ్చాకే సెట్స్ పైకి నాగ్!

నాగార్జున ప్రధాన పాత్రధారిగా రూపొందిన 'రాజుగారి గది 2' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత నాగార్జున నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో .. ఎప్పుడు? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అయితే నాగార్జున హీరోగా చేసే సినిమా ఇప్పట్లో ఉండదని తెలుస్తోంది. ఎందుకంటే ఆయన తన పూర్తి సమయాన్ని అఖిల్ సినిమా వ్యవహారాలు చూసుకోవడానికే కేటాయిస్తున్నారట.

 అఖిల్ ఫస్ట్ పిక్చర్ ప్లాప్ కావడంతో .. రెండవ సినిమా విషయంలో నాగార్జున మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారట. ఇది అఖిల్ కెరియర్ కి సంబంధించిన కీలకమైన సమయం కావడం వలన, ఆయన ఈ సినిమాపైనే శ్రద్ధ పెట్టారట. ఇందుకోసం భారీ బడ్జెట్ అవుతున్నా ఆయన వెనుకాడటం లేదు .. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఇంతవరకూ వచ్చిన సినిమాల్లో ఇదే హయ్యస్ట్ బడ్జెట్ మూవీ అని తెలుస్తోంది. ఈ సినిమా థియేటర్స్ కి వచ్చాకే .. నాగ్ తాను కథానాయకుడిగా చేయనున్న సినిమాల గురించిన ఆలోచన చేస్తారట. 
Go Back to Shorts
akhil
nagarjuna

More Telugu News