'వెళ్లిపోమాకే' చిత్రం నా మనసు దోచేసింది: దిల్ రాజు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'వెళ్లిపోమాకే' చిత్రం నా మనసు దోచేసింది: దిల్ రాజు

చిన్న సినిమాలను తెరకెక్కించే దర్శకులను ప్రోత్సహించడంలో దిల్ రాజు ఎప్పుడూ ముందుంటారు. కంటెంట్ ఉంటే చాలు చిన్న సినిమాలను ఆయన అద్భుతంగా ప్రమోట్ చేస్తుంటారు. ప్రేక్షకుల మనసులకు దగ్గరగా తీసుకెళ్లి విజయాలను సొంతం చేసుకుంటూ వుంటారు. దర్శకుడు యాకూబ్ అలీ తెరకెక్కించిన 'వెళ్లిపోమాకే' సినిమా చూసిన దిల్ రాజు.. ఈ సినిమా తనకి బాగా నచ్చేసిందని చెప్పారు.

దర్శకుడు యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని తెరకెక్కించాడని అన్నారు. నటీనటులు తమ పాత్రల పరిథిలో చాలా చక్కగా నటించారని చెప్పారు. ఈ సినిమాను తాను సపోర్ట్ చేస్తున్నానని అన్నారు. ఈ సినిమాను విడుదల చేయడానికి దిల్ రాజు ముందుకు వచ్చినందుకు దర్శకుడు యాకూబ్ అలీ ధన్యవాదాలు తెలియజేశాడు. సెప్టెంబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చెప్పారు. 
dil raju

More Telugu News