నాని .. శర్వానంద్ దారిలో నితిన్?
నితిన్ మార్కెట్ కి మించి ఖర్చు చేయడమే ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాని .. శర్వానంద్ లు తమ సినిమా బడ్జెట్ 10 నుంచి 15 కోట్ల లోపే ఉండేలా చూసుకుంటారు. ఎలాంటి పరిస్థితుల్లోను ఆ మార్జిన్ దాటకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అందువల్లనే వాళ్ల సినిమాలు హిట్ అయితే భారీ స్థాయిలో లాభాలు ఉంటాయి .. పరాజయం పాలైతే నష్టాలు పెద్దగా వుండవు. అందువలన నితిన్ కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తే బాగుంటుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.