: జగన్ వ్యాఖ్యల దృష్ట్యా చంద్రబాబుకు మరింత సెక్యూరిటీ పెంచాలి: జ్యోతుల నెహ్రూ


జగన్ వ్యాఖ్యల దృష్ట్యా ఏపీ సీఎం,టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అప్రమత్తంగా ఉండాలని, ఆయనకు మరింత సెక్యూరిటీ పెంచాలని టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ సూచించారు. ఓ న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జగన్ ఎలాంటి వ్యక్తో తెలియకపోతే ఆశ్చర్యపడాలని, నేర ప్రవృత్తి కలిగిన జగన్ ఎలాంటి వ్యక్తో తనకు తెలుసు కాబట్టి ఆశ్చర్యపడటం లేదని అన్నారు.

అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం జాగ్రత్తపడాల్సిన అవసరం ఉందని చెప్పారు. కుంచిత స్వభావం, ఆలోచనలు కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, అధికారపక్షాన్ని విమర్శించడం మాత్రమే చేయకూడదు, సూచనలు కూడా చేయాలని నాడు తాను వైసీపీలో ఉన్నప్పుడు జగన్ కు చెబితే పట్టించుకునేవారు కాదని ,అటువంటి వ్యక్తి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని అన్నారు. నంద్యాల ఉపఎన్నికల గురించి ప్రస్తావిస్తూ అభివృద్ధిని కోరుకునే టీడీపీకి, అరాచకాలకు పాల్పడే వైసీపీకి మధ్య పోటీ అని అన్నారు. నంద్యాల నియోజకవర్గంలో టీడీపీకి సంప్రదాయ ఓటర్లు ఉన్నారని, తాము గెలవడం ప్రామాణికం కాదని, ఎంత మెజార్టీతో తమ అభ్యర్థి విజయం సాధిస్తాడనే దానిపైనే ఆలోచిస్తున్నామని చెప్పారు. 

  • Loading...

More Telugu News