: 'సైకిల్ గుర్తుకే ఓటెయ్యండి.. భూమా బ్రహ్మానందరెడ్డినే గెలిపించండి' అని చెప్పను!: వేణుమాధవ్


నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో తన స్టైలే వేరని టీడీపీ తరపున ప్రచారం చేస్తున్న ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ అంటున్నాడు. నంద్యాలలో మీడియాతో ఆయన మాట్లాడుతూ,‘సైకిల్ గుర్తుకే ఓటెయ్యండి.. భూమా బ్రహ్మానందరెడ్డినే గెలిపించండి’ అని చెప్పను. ఎందుకంటే, అందరి గుండెల్లో సైకిల్ గుర్తు ఉంది. అందరి హృదయాల్లో భూమా నాగిరెడ్డి గారు, శోభానాగిరెడ్డి గారు ఉన్నారు. ప్రజలందరూ కూడా భూమా కుటుంబం వైపే ఉన్నారు. హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ విజయం సాధిస్తుంది. అందులో, ఎలాంటి అనుమానం లేదు. మేము ఆలోచించేదల్లా.. ఎంత మెజార్టీతో భూమా బ్రహ్మానందరెడ్డి గెలుస్తాడనే విషయమే.. మిగత విషయాలను పట్టించుకోవట్లేదు’ అని అన్నాడు.

  • Loading...

More Telugu News