బాలకృష్ణ రోడ్ షో సూపర్ సక్సెస్: సోమిరెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలకృష్ణ రోడ్ షో సూపర్ సక్సెస్: సోమిరెడ్డి

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో భాగంగా ఈ రోజు త‌మ పార్టీ ఎమ్మెల్యే, సినీన‌టుడు బాలకృష్ణ నిర్వ‌హించిన‌ రోడ్ షో సూపర్ సక్సెస్ అయ్యిందని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి అన్నారు. ఈ నెల 19న సీఎం చంద్ర‌బాబు నాయుడు కూడా రోడ్ షో నిర్వ‌హిస్తార‌ని అన్నారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌ అనవసరంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. 2014లో కర్నూలులో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో చంద్ర‌బాబు నాయుడు ఇచ్చిన హామీల‌ పనులు కొన‌సాగుతున్నాయ‌ని తెలిపారు. కాగా, రాయలసీమ, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్స‌హిస్తున్నామ‌ని తెలిపారు. 

More Telugu News