: చైనాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఫేస్‌బుక్.. ఫొటో షేరింగ్ అప్లికేషన్ విడుదల!


సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తిరిగి చైనాలో అడుగుపెట్టింది. అయితే ‘పేస్‌బుక్’లా కాకుండా పేరు, రూపు మార్చుకుంది. ‘కలర్‌ఫుల్ బెలూన్స్’ పేరుతో ఫొటో షేరింగ్ యాప్‌ను విడుదల చేసింది. ఈ మేరకు ‘న్యూయార్క్ టైమ్స్’ తెలిపింది. అయితే ఈ యాప్ విడుదలలో తమ పాత్ర ఉందన్న విషయం తెలియడానికి గాను జుకర్‌బర్గ్ సంస్థ  జాగ్రత్త పడింది. ఇందుకోసం బీజింగ్‌లోని ఓ భవనం అడ్రస్‌ను తమ  సంస్థ చిరునామాగా పేర్కొంది. ఈ ఏడాది మొదట్లోనే విడుదలైన ఈ యాప్ అచ్చం ఫేస్‌బుక్‌నే పోలి ఉంది.

కాగా, చైనాలో ఫేస్‌బుక్‌పై 2009 నుంచి నిషేధం అమలులో ఉంది. గూగుల్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లు కూడా అక్కడ పనిచేయవు. వాటిపై చైనా ప్రభుత్వం సెన్సార్‌షిప్ విధిస్తోంది. ఫేస్‌బుక్‌పై కొనసాగుతున్న నిషేధాన్ని ఎత్తివేయాల్సిందిగా జుకర్‌బర్గ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పలుమార్లు చైనాను  సందర్శించిన జుకర్‌బర్గ్ అక్కడి నేతలు, అధికారులను కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో పేరు, అడ్రస్ మార్చుకుని అచ్చం ఫేస్‌బుక్‌నే పోలిన అప్లికేషన్‌ను విడుదల చేసింది.

  • Loading...

More Telugu News