: కార్యదర్శిగా ఐవీ సుబ్బారావును ఎంచుకున్న వెంకయ్యనాయుడు


నేడు భారత ఉప రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, తనకు కార్యదర్శిగా మాజీ ఐఏఎస్ అధికారి ఐవీ సుబ్బారావును ఎంచుకున్నారు. ఆయన పూర్తిపేరు ఇలపావులూరి వెంకట సుబ్బారావు. ప్రకాశం జిల్లాకు చెందిన ఆయనకు మృదుభాషిగా, సౌమ్యుడిగా పేరుంది. ప్రభుత్వంలో పలు హోదాల్లో, విద్యాశాఖలో ఉన్నత స్థాయిలో పనిచేశారు. వెంకయ్యనాయుడికి సన్నిహితుడిగా ఉండేవారు. ఆయన నియామకం ఖరారైందని తెలుస్తోంది. ఇక తనకు ప్రైవేట్ ఓఎస్డీగా సత్య అనే వ్యక్తిని వెంకయ్య నియమించుకోనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News