అఖిల్ లో మంచి మాస్ యాంగిల్ వుంది : బోయపాటి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అఖిల్ లో మంచి మాస్ యాంగిల్ వుంది : బోయపాటి

బోయపాటి తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'జయ జానకి నాయక' ముస్తాబవుతోంది. రేపే ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలవుతోంది. ఈ సినిమాను గురించి మాట్లాడిన బోయపాటి .. తన తదుపరి సినిమాల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. చిరంజీవి .. బాలకృష్ణ .. మహేశ్ ల కోసం తన దగ్గర కథలు రెడీగా ఉన్నాయని చెప్పారు. ఇదే సందర్భంలో ఆయన అఖిల్ గురించి కూడా మాట్లాడారు.

అఖిల్ మొదటి సినిమా చూసినప్పుడే ఆయన ఆల్ రౌండర్ అనే విషయాన్ని గ్రహించానని అన్నారు. అఖిల్ లో మంచి మాస్ యాంగిల్ ఉందనీ .. భవిష్యత్తులో ఆయనకి మాస్ ఫాలోయింగ్ ఒక రేంజ్ లో వుండే అవకాశం ఉందని చెప్పారు. ఆయన కోసం కూడా రెండు లైన్స్ సిద్ధం చేశానని అన్నారు. ఇదంతా చూస్తుంటే అఖిల్ తో సినిమా చేయడానికి ఆసక్తిని చూపించే దర్శకులలో బోయపాటి కూడా ఉన్నారనే విషయం అర్థమవుతోంది కదూ?
akhil

More Telugu News