: జీసస్ శిష్యుడు సెయింట్ పీటర్ జన్మస్థలం బెత్సయిదా గ్రామాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు!
క్రీస్తు శిష్యుల్లో ప్రధముడిగా గుర్తింపు పొందిన సెయింట్ పీటర్ స్వగ్రామాన్ని పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఉత్తర ఇజ్రాయిల్ లోని గెలిలీ నది ఒడ్డున సెయింట్ పీటర్ జన్మించిన బెత్సయిదా గ్రామాన్ని అమెరికా, ఇజ్రాయిల్ శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. మొదటి శతాబ్దానికి చెందిన చరిత్రకారుడు ఫ్లావియస్ జోసెఫస్ చెప్పిన ప్రకారం జులియస్ అనే నగరాన్ని క్రీస్తు శకం 30వ శతాబ్దంలో నిర్మించారు. ఈ నగరాన్ని సెయింట్ పీటర్ జన్మించిన బెత్సయిదా గ్రామంపై నిర్మించారని వారు తెలిపారు. సెయింట్ పీటర్ తో పాటు సెయింట్ ఫిలిప్, పీటర్ సోదరుడైన సెయింట్ ఆండ్రూ కూడా ఇదే గ్రామంలో జన్మించారు. మత్స్యకారులైన ఈ ముగ్గురూ క్రీస్తు పిలుపుతో ఆయనను అనుసరించారని బైబిల్ చెబుతుంది.
జూలియస్ నగరాన్ని వెలుగులోకి తెచ్చేందుకు జరుపుతున్న పరిశోధనల్లో ఊహించని విధంగా దానికంటే ముందే నిర్మితమైన బెత్సయిదా గ్రామం వెలుగులోకి వచ్చిందని శాస్త్రవేత్తల బృందం తెలిపింది. ఈ తవ్వకాల్లో మట్టిపాత్రలు, నాణేలు, స్నానపు గదులు వంటి వాటిని వెలుగులోకి తెచ్చామని వారు తెలిపారు. అవన్నీ బెత్సయిదా గ్రామం చిన్నదేనని తెలిపేలా ఉన్నాయని వారు తెలిపారు.