: యూట్యూబ్‌లో మరో అద్భుతమైన ఫీచర్‌!


ఇంటర్నెట్‌లో ఏవైనా వీడియోలు చూడాల‌నుకుంటే మ‌న‌కు ముందుగా గుర్తుకొచ్చేది యూట్యూబ్‌. త్వరలో ఆ సంస్థ‌ అందించే అప్‌డేట్‌ ద్వారా ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ వినియోగదారులు మరో చ‌క్కటి సదుపాయాన్ని అందుకోనున్నారు. వాట్స‌ప్‌, ఫేస్‌బుక్, ట్విట్ట‌ర్ వంటి సామాజిక మాధ్య‌మాల్లోలాగే ఇక‌పై యూట్యూబ్‌లోనూ వీడియోలను నేరుగా యూజ‌ర్లు షేర్ చేసుకోవ‌చ్చు. ఇప్పటివ‌ర‌కు యూ ట్యూబ్ వీడియోల‌ను షేర్ చేసుకోవాలంటే ఆ వీడియోల‌కు సంబంధించిన లింకును మ‌రో యాప్ లో షేర్ చేయాల్సి వ‌చ్చేది. దీన్ని దృష్టిలో ఉంచుకుని యూట్యూబ్‌ తమ వినియోగదారులకు కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన‌ట్లు తెలిపింది.

ఇక‌పై త‌మ‌ యాప్‌లోనే ఇతరులతో వీడియోలను పంచుకోవ‌డ‌మే కాకుండా, ఆ వీడియో గురించి యాప్‌లోనే చర్చించుకోవచ్చని పేర్కొంది. అలాగే  ఇంత‌కు ముందులా వీడియోలను ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకునే అవ‌కాశం కూడా అలాగే ఉంటుంద‌ని వెల్ల‌డించింది. ఆ స‌దుపాయాన్ని ఇప్ప‌టికే కెనడాలో అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తున్నామ‌ని చెప్పింది. 

  • Loading...

More Telugu News