మరో బ్యానర్ ఆలోచన విరమించుకున్న కాజోల్!
ఈ నేపథ్యంలో తాను మరో బ్యానర్ ను ఏర్పాటు చేయనున్నట్టు ఇటీవల కాజోల్ చెప్పింది. సెప్టెంబర్ లో ఈ బ్యానర్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపింది. అయితే ఈ విషయంలో తాను ఇప్పుడు మనసు మార్చుకున్నట్టు కాజోల్ చెప్పింది. మరో బ్యానర్ ను స్థాపించే ఆలోచనను విరమించుకున్నాననీ, తమ నిర్మాణ సంస్థను బలోపేతం చేయడంలో భర్తకి సహకరిస్తానని తెలిపింది. బరువైన బాధ్యతలు చేపట్టడం కన్నా, భర్త చాటు భార్యగా ఉండటానికే ఇష్టపడతానని చెప్పారు.