'జయ జానకి నాయక' .. 'లై' సినిమాలు దిల్ రాజుకి నష్టాలు పూడ్చేనా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'జయ జానకి నాయక' .. 'లై' సినిమాలు దిల్ రాజుకి నష్టాలు పూడ్చేనా?

ప్రతి వ్యాపారంలో మాదిరిగానే సినిమా బిజినెస్ లోను లాభనష్టాలు ఉంటూ ఉంటాయి. ఇలాంటివాటిలో పండిపోయిన వ్యక్తిగా దిల్ రాజు కనిపిస్తుంటాడు. 'ఓం నమో వేంకటేశాయ' సినిమా ఆయనకి నష్టాన్నే మిగిల్చింది. అయితే నిర్మాతగా ఆయనకు 'శతమానం భవతి' .. 'దువ్వాడ జగన్నాథమ్' .. 'ఫిదా' సినిమాలు లాభాలనే తెచ్చిపెట్టాయి.

అలాంటి దిల్ రాజుకి 'గౌతమ్ నంద' .. 'దర్శకుడు' సినిమాలు నష్టాలనే తెచ్చిపెట్టాయనే టాక్ వినిపిస్తోంది. ఈ నెల 11న రానున్న 'జయ జానకి నాయక' సినిమాను ఆయనే విడుదల చేస్తున్నాడు. ఇక 'లై' సినిమాకి సంబంధించి నైజామ్ వరకూ కొంత వాటా తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమాలైనా నష్టాన్ని పూడుస్తాయేమో చూడాలి. నిర్మాతగా లాభాలు సాధిస్తోన్న ఆయన .. డిస్ట్రిబ్యూషన్ లో నష్టాలు ఎదుర్కుంటూ ఉండటం ఆశ్చర్యం.   
dil raju

More Telugu News