Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిత్యామీనన్ బాటలోనే అనుపమ పరమేశ్వరన్!

తెలుగు తెరకి పరిచయమవుతూనే అనుపమ పరమేశ్వరన్ కుర్రకారు ప్రేక్షకుల మనసులను దోచేసింది. వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ లక్కీ హీరోయిన్ అనిపించుకుంది. అందం .. ఆకర్షణ .. అభినయం సమపాళ్లలో వున్నట్టుగా కనిపించే ఈ కథానాయికకి, ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదనే చెప్పాలి.

 వరుస సక్సెస్ లు వెంటవున్నా అవకాశాలు ఆ స్థాయిలో పరిగెత్తుకు రాకపోవడం విశేషం. అందుకు కారణం ఆమె గ్లామర్ ను ఒలికించే విషయంలో ససేమిరా అనడం .. ఆమె ఎత్తు తక్కువగా ఉండటం అనే టాక్ వినిపిస్తోంది. ఈ రెండు కారణాల వల్లనే అవకాశాలు తక్కువగా పలకరిస్తున్నాయని చెప్పుకుంటున్నారు. తెలుగులో ఆమధ్య నిత్యామీనన్ కి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది .. ఇప్పుడు అదే రూట్లో అనుపమ వుంది అంతే! 
anupama parameshvaran

More Telugu News