: అఫ్రిది నిర్వహించిన వేలంపాటలో రూ. 3 లక్షలు పలికిన విరాట్ జెర్సీ
2016లో భారత్‌లో నిర్వహించిన టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ తన జెర్సీని పాకిస్థాన్ క్రీడాకారుడు షాహిద్ అఫ్రిదికి ఇచ్చాడు. ఈ జెర్సీపై అప్పటి భారత ఆటగాళ్లందరూ సంతకం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే జెర్సీని అఫ్రిది తన స్వచ్ఛంద సంస్థ ఎస్ఏ ఫౌండేషన్ కోసం లండన్‌లో నిర్వహించిన వేలం పాటలో అందుబాటులో ఉంచాడు. ఆ వేలంలో విరాట్ జెర్సీ రూ. 3 లక్షలు పలికింది. దీంతో తన వద్ద ఉన్న ఇతర క్రికెటర్ల జెర్సీలను కూడా అఫ్రిది వేలం వేశాడు. తద్వారా వచ్చిన డబ్బును తన ఫౌండేషన్ ద్వారా చిన్న పిల్లల విద్య కోసం ఖర్చు పెట్టనున్నాడు. ఈ వేలం వేడుకకు పాకిస్థాన్ క్రికెటర్లు ఆమిర్, ఇమాద్ వసీంలు హాజరయ్యారు.