: 'దెయ్యాలు తాగే వోడ్కా'ను తాగి ఆసుపత్రి పాలయ్యాడు!
ప్రపంచంలోనే ఘాటుగా ఉండే కరోలినా రీపర్ మిరప కాయలతో చేసిన వోడ్కాకు 'దెయ్యాలు తాగే వోడ్కా' అని పేరు. దీని లేబుల్ మీద `1780 శాతాన్ షాట్, దీన్ని కరోలినా రీపర్ మిరపకాయలతో చేశారు. తాగేముందు జాగ్రత్త` అని రాసి ఉంటుంది. ఇదేదీ చూసుకోకుండా స్నేహితురాలు పార్టీ ఇచ్చింది కదా అని శాతాన్ షాట్‌ను తాగి ఆసుపత్రి పాలయ్యాడు బ్రిటన్‌కు చెందిన వ్యక్తి.
బ్రిటన్‌లోని సర్రే ప్రాంతంలో జరుగుతున్న మిరప కాయల ఎగ్జిబిషన్‌లో ఈ శాతాన్ వోడ్కాను ఎమ్మా మిర్రింగ్టన్ కొనుక్కొచ్చింది. సాయంత్రం తన స్నేహితులను పిలిచి పార్టీ ఏర్పాటు చేసింది. అలా పార్టీకి వచ్చిన ఓ వ్యక్తి ఈ వోడ్కాను తాగి ఘాటు భరించలేక అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేసిన తర్వాత కోలుకున్నాడు. ఈ సంఘటనకు ఎమ్మా, మొదట వోడ్కా తయారుచేసిన కంపెనీని తప్పుబట్టింది. వారు తమ బాటిల్‌పై ముద్రించిన సూచనలు చూపించి, ఇవి చదవకుండా తాగితే అలాగే ఉంటుందని కొట్టినట్లు చెప్పడంతో ఎమ్మా తెల్లమొహం వేసింది.