'ఉయ్యాలవాడ' పట్ల ఆసక్తిని చూపిన అమితాబ్?

మెగాస్టార్ అభిమానులంతా 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' సినిమాపైనే దృష్టి పెట్టారు. ఈ సినిమా విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వాళ్లంతా ఎంతో ఆత్రుత చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో అమితాబ్ చేయడం దాదాపు ఖరారైనట్టేననే వార్త ఒకటి షికారు చేస్తోంది.

చారిత్రక నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర ఉందట. ఈ సినిమాను జాతీయస్థాయిలో విడుదల చేసే ఆలోచన వుంది కనుక, ఈ పాత్రను అమితాబ్ తో చేయిస్తే బాగుంటుందని చిరంజీవి తలిచారు. ఈ విషయంపై అమితాబ్ ను సంప్రదించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ సినిమా కథ .. తన పాత్ర నచ్చడంతో అమితాబ్ సుముఖతను వ్యక్తం చేసినట్టుగా తాజా సమాచారం. మెగాస్టార్  రిక్వెస్ట్ చేయడం .. చారిత్రక నేపథ్యంతో కూడిన కథ కావడం వలన, అమితాబ్ ఆసక్తిని చూపారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
Go Back to Shorts
chiranjeevi
nayanatara

More Telugu News