Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శింబు సినిమాలో పాటలు లేవు .. ఇంటర్వెల్ ఉండదు!

మొదటి నుంచి కూడా శింబుకి ప్రయోగాలు చేయడం అలవాటే. తన సినిమాలు ఏ స్థాయి హిట్ కొట్టాయనే దానికంటే, తనని తాను కొత్తగా తెరపై చూసుకోవడానికే ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటాడు. అలా ప్రయోగాత్మకంగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా ఆయన నిరాశ చెందడం లేదు.

 మరో ప్రయోగానికి తాను సిద్ధమంటూ ఒక ప్రకటన చేశాడు. తన తదుపరి సినిమాలో పాటలు ఉండవనీ ..  ఇంటర్వెల్ కూడా ఉండదని చెప్పాడు. పాటలు లేకుండా కొన్ని సినిమాలు వచ్చాయి గానీ .. ఇంటర్వెల్ లేకుండా సినిమా రావడం ఇదే మొదటిసారని కోలీవుడ్ జనాలు అంటున్నారు. 'కెట్టవన్ కేట్టిదిల్ కిట్టిడుమ్ రాజయోగం' అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను, టి. రాజేందర్ నిర్మిస్తుండగా, శింబు దర్శకత్వం వహిస్తుండటం విశేషం
simbu

More Telugu News