ఎన్ని సార్లు మమ్మల్ని క్షోభ పెడతారు?: మీడియాను ప్రశ్నించిన తరుణ్

24-07-2017 Mon 07:20 | Entertainment
డ్రగ్స్ కేసులో ప్రాథమిక విచారణ అనంతరం టాలీవుడ్ నటుడు తరుణ్ తన సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. మొదటి నుంచీ మీడియా తనను ఎంతగానో సపోర్ట్ చేసిందని, ఈ మధ్య కాలంలో మాత్రం తనపై కక్షగట్టినట్టు రూమర్లు ప్రచారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. తానేదో బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయానని, తన తల్లి స్నేహితురాలి కుమార్తెతో తన వివాహం కుదిరిపోయిందని, తాను నెలలో 15 రోజులు గోవాలో ఉంటానని, తనకు బినామీ పేర్లతో పబ్ లలో వాటాలు ఉన్నాయని... ఇలా రకరకాల ప్రచారాలు తనపై జరిగాయని అన్నాడు.

ఇలాంటి పుకార్లు తన కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపి ఉంటాయో ఎవరైనా,  ఏనాడైనా ఆలోచించారా? అని ప్రశ్నించాడు. మీడియాలో వచ్చే రోజుకొక వార్తతో తన కుటుంబం చాలా క్షోభపడుతోందని, దయచేసి ఇలాంటి పుకార్లను ప్రచారం చేయడం ఆపాలని కోరాడు. సిట్ విచారణకు పూర్తిగా సహకరించానని చెప్పాడు. చట్టంపైన, అకున్ సబర్వాల్ పైన తనకు పూర్తి విశ్వాసం ఉందని, తానేతప్పు చేయలేదని స్పష్టం చేశాడు. తానేనాడు చట్టపరిధిని దాటి వ్యవహరించలేదని అన్నాడు. డ్రగ్స్ ను నిరోధించాల్సిన అవసరం ఉందని చెప్పిన తరుణ్... ప్రతి ఒక్కరూ ఇందుకు సహకరించాలని సూచించాడు. 

More Telugu News

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09
..more