: చట్టం తన పని తాను చేసుకుపోతుంది: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ


ఈ రోజు ఉదయం తిరుమలకు వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ, టాలీవుడ్ డ్రగ్స్ దందాపై స్పందించారు. ఈ కేసులో హైదరాబాద్ పోలీసులు తమ పనిని తాము చేసుకుంటూ వెళుతున్నారని పేర్కొన్న ఆయన, ఎక్సైజ్ సిబ్బంది చట్ట ప్రకారం ముందుకు కదులుతున్నారని అన్నారు. ఒత్తిడి వల్లే యువత పెడదారి పడుతోందని అభిప్రాయపడ్డ ఆయన, తల్లిదండ్రులు పిల్లల కోసం సమయాన్ని కేటాయించి, వారికి మంచి మార్గాన్ని బోధించాలని సూచించారు. సమాజంలో మార్పుల కోసం యువత ఏం చేయాలన్న విషయమై విశ్వ విద్యాలయాల్లో అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని లక్ష్మీ నారాయణ వ్యాఖ్యానించారు. తిరుమల ఆలయానికి వచ్చిన లక్ష్మీ నారాయణకు ప్రొటోకాల్ అధికారులు స్వాగతం పలికి, దర్శనం చేయించారు. అనంతరం ఆయనకు తీర్థ ప్రసాదాలను అందించారు.

  • Loading...

More Telugu News