ప్రెస్ నోట్: ట్రాయిట్‌లో ప్రారంభోత్స‌వానికి స‌ర్వం సిద్ధ‌మైన గోదావ‌రి సౌత్ ఇండియన్ రెస్టారెంట్‌

21-07-2017 Fri 19:01 | International
ప్రెస్ నోట్: కొలంబ‌స్‌లో ఏర్పాటుచేసిన రెస్టారెంట్ ఘ‌నవిజ‌యం, మొట్ట‌మొద‌టి సౌత్ ఇండియ‌న్ ఫుడ్ ట్ర‌క్ అమెరికాలో ఆద‌ర‌ణ పొంద‌డం అనే ప్రత్యేకతలకు కొనసాగింపుగా `గోదావరి` డెట్రాయిట్ వాసుల‌ను అల‌రించేందుకుఅద్భుత‌మైన ఆహార ప‌దార్థాలు మ‌రియు విందు సౌల‌భ్యాల‌తో సిద్ధ‌మైంది.
 
గోదావ‌రి, (GODAVARI) అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దక్షిణ భార‌త‌దేశ వంట‌కాల‌ రెస్టారెంట్ దిగ్గ‌జం డెట్రాయిట్ లో జూలై 22, 2017లో త‌న నూత‌న రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసేందుకు స‌ర్వం సిద్ధంచేసుకుంది. పెద్ద సంఖ్య‌లో భార‌తీయుల నివాసాలు ఉన్న కీలక ప్రాంత‌మైన‌ ఫ‌ర్మింగ్‌ట‌న్ హిల్స్‌ లో గోదావ‌రి డెట్రాయిట్ త‌న కొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించ‌నుంది.
 
గోదావ‌రి డెట్రాయిట్ రెస్టారెంట్ సువిశాల‌మైన చ‌క్క‌ని ప్రాంతంలో కొలువుదీరి విషాల‌మైన పార్కింగ్ సౌల‌భ్యాన్ని క‌లిగి ఉండి త‌న‌దైన ముద్ర‌ను నిల‌బెట్టుకుంది. గోదావ‌రి డెట్రాయిట్‌లో “పుష్క‌ర‌” పేరుతో సిద్ధం చేసినఆకట్టుకునే బాంక్వెట్ హాల్‌ సుమారు 150 మందికి పైగా అతిథులు త‌మ వేడుక‌లు అట్ట‌హాసంగా నిర్వ‌హించుకునేలా తీర్చిదిద్ద‌బ‌డి ఉంది.
 
ఈ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా గోదావ‌రి డెట్రాయిట్ య‌జ‌మాని రాజేశ్ త‌న ఉద్విగ్న‌భ‌రిత సంతోషాన్ని పంచుకున్నారు. “స‌బ్‌వే ఫ్రాంచైజీని ఫ‌ర్మింగ్ టౌన్ హిల్స్ (Farmington Hills) ప్రాంతంలో గ‌త ప‌దేళ్లుగా నిర్వ‌హిస్తున్నాం.ఈ క్ర‌మంలో మేం దక్షిణాది భార‌తీయ వంట‌కాల రంగంలోకి అడుగుపెట్టాల‌ని భావించాం. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే అత్యుత్త‌మ ఆద‌ర‌ణ పొందిన సౌత్ ఇండియ‌న్ చెయిన్ `గోదావ‌రి`ని ఎంపిక చేసుకున్నాం. మా ఎంపికమొద‌లయిన క్ష‌ణం నుంచి స్థ‌లం ఎంపిక‌, ప్రారంభోత్స‌వం వ‌ర‌కు...ప్ర‌తి ద‌శ‌లోనూ టీం గోదావ‌రి మాకు వెన్నంటి ఉంటోంది” అని హ‌ర్షం వ్య‌క్తం చేశారు.
 
`గోదావ‌రి`కి ప్ర‌త్యేకమైన సాటిలేని వంట‌కాల రుచులు డెట్రాయిట్ భోజ‌న ప్రియుల‌ను సైతం అల‌రించ‌నున్నాయి. గోదావ‌రి డెట్రాయిట్ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా అద్భుతంగా సిద్ధం చేసిన లంచ్ బ‌ఫెట్ భోజ‌న ప్రియుల‌ కోసంసిద్ధంగా ఉంది. గోదావరి ప్ర‌త్యేక వంట‌కాలైన “అమ‌ల అప్ప‌డం బ‌జ్జి”, “గోల్కొండ కోడి చిప్స్‌”, “పంప్‌సెట్ పీత‌ల వేపుడు”, “అమ‌రావ‌తి పూర్ణాలు”, “మునియండి విలాస్ నాటు కోజి” తో పాటుగా అనేక ప‌ల్లెసీమ‌ల రుచులుఆహార ప్రియుల‌ను నోరూరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
 
“మేం టీం గోదావ‌రి ద్వారా అమెరికా వ్యాప్తంగా ఉన్న భోజన ప్రియుల‌కు అత్యుత్త‌మ‌మైన దక్షిణ భార‌తీయ వంట‌కాల‌ను అందించేందుకు నిరంతరం మా ప్ర‌త్యేక శ్ర‌మ‌ను కొన‌సాగిస్తున్నాం. ఉత్సాహ‌భ‌రితయువ‌పారిశ్రామిక‌వేత్త‌లుగా మేం కేవ‌లం బ్రాండ్ నిర్మాణం కోసం మాత్ర‌మే కాకుండా ద‌క్షిణ భార‌త‌దేశ వంట‌కాల మైమ‌రిపోయే రుచుల‌ను ప్ర‌పంచవ్యాప్తంగా చేర‌వేస్తున్నాం. ఈ క్ర‌మంలో అనేక న‌గ‌రాల నుంచి త‌మ‌కు గోదావ‌రితోఅనుబంధం కొనసాగాల‌నే ఆస‌క్తి ఉంద‌ని తెలుపుతు పెద్ద సంఖ్య‌లో ద‌ర‌ఖాస్తులు వ‌స్తున్నాయి” అని టీం గోదావ‌రికి చెందిన‌ వ‌రుణ్ మేడిశెట్టి వివ‌రించారు.
 
“బోస్ట‌న్‌లో మా మొట్ట‌మొద‌టి రెస్టారెంట్‌ను ప్రారంభించి కేవ‌లం 26 నెల‌లే అయింది. ఇప్పుడు ప్ర‌స్తుతం మేం  16 కేంద్రాల్లో మా సేవ‌ల‌ను ఆత్మీయ అతిథుల‌కు అందిస్తున్నాం. అంతేకాకుండా “స్పైసీ సలా” పేరుతోమొట్ట‌మొద‌టి సౌత్ ఇండియ‌న్ ఫుడ్ ట్ర‌క్ ను నిర్వ‌హిస్తున్నాం. ఇదంతా మా ప్రియ‌మైన వినియోగ‌దారుల ఆద‌రాభిమానాల వ‌ల్లే సాధ్యామైంది” అని గోదావ‌రి స‌హ వ్య‌వ‌స్థాప‌కులు తేజా చేకూరి తెలిపారు.
 
ప్రారంబోత్స‌వానికి స‌ర్వం సిద్ధ‌మైన గోదావ‌రి డెట్రాయిట్ గోదావ‌రి బ్రాండ్ కీర్తికిరీటంలో వ‌జ్రంగా నిలిచి ఉండ‌నుంది. ఆక‌ట్టుకునే ప్రాంతం, చూడ‌చ‌క్క‌ని వాతావ‌ర‌ణం, అద్భుత‌మైన విందు అనుభూతుల స‌మ్మిళితంగా ఉన్నగోదావ‌రి డెట్రాయిట్...త‌న వినియోగ‌దారులకు మునుపెన్న‌డూ లేని ఆక‌ర్ష‌ణీయ‌మైన ఆహార రుచుల‌ను అందించ‌నుంది. విభిన్న‌మైన వంట‌కాల‌తో అతిథుల మ‌న‌సును దోచుకోనుంది.
 
మ‌రిన్ని వివ‌రాల‌కు సంప్ర‌దించండి:
రాజేశ్ పి.
630-340-9760
DETROIT@GODAVARIUS.COM
 
రాజసంతో కూడిన రుచికరమైన గోదావరి లంచ్ విందుకి ఇదే సమయం…
 
మా రెస్టారెంట్ కొలువుదీరిన ప్రాంతం:
గోదావ‌రి డెట్రాయిట్
35203 గ్రాండ్ రివ‌ర్ అవెన్యూ,
ఫ‌ర్మింగ్‌ట‌న్‌, మిచిగాన్‌ 48335.
Ph: 248-987-6824.
 
అద్భుత‌మైన స్వాగ‌తం, అత్యంత భారీ ఆద‌ర‌ణ‌ను అందించిన కొలంబ‌స్, ఓహియో వాసుల‌కు “టీం” గోదావ‌రి త‌న ప్ర‌త్యేక అభినంద‌న‌లు ఈ సంద‌ర్భంగా తెలుపుతోంది. గోదావ‌రి కొలంబ‌స్ గ్రాండ్ ఓపెనింగ్ ట్రైల‌ర్‌ను ఈ క్రింది వీడియోలో  వీక్షించ‌వ‌చ్చు:
 
www.GodavariUS.com
 
Press note released by: Indian Clicks, LLC
GodavariUS

More Telugu News

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09
..more