: విజయాలను తండ్రికి అంకితమిస్తూ భావోద్వేగానికి గురైన ముఖేష్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ సర్వసభ్య సమావేశంలో ఆ సంస్థ ఛైర్మన్ ముఖేష్ అంబానీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. గద్గద స్వరంతో రిలయన్స్ సాధించిన విజయాలను సర్వసభ్యసమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా సంస్థను స్థాపించిన తన తండ్రిని తలచుకున్నారు. తన తల్లి సహకారంతో ఆయన వేసిన పునాది ఈనాడు ఇంతింతైవటుడింతై అన్నట్టు ఎదిగిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తన తల్లిదండ్రులను తల్చుకున్న ఆయన ఒక్క నిమిషం పాటు మాటలు అందక మౌనం దాల్చారు. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఉబికి వస్తున్న భావాలను దిగమింగి తన ప్రసంగం కొనసాగించారు.