: ఉప రాష్ట్రపతి పదవికి వెంకయ్యనాయుడు అన్ని విధాలా అర్హుడు: అమిత్ షా
ఉప రాష్ట్రపతి పదవికి వెంకయ్యనాయుడు అన్ని విధాలా అర్హులని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు పేరును అధికారికంగా ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, ఎన్డీఏ మిత్రపక్షాలు, బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ లో చర్చ అనంతరం వెంకయ్యనాయుడి పేరును ఖరారు చేశామని చెప్పారు. వెంకయ్యనాయుడు కొన్ని దశాబ్దాలుగా బీజేపీకి సేవలు చేస్తున్నారని, ఆయన ఎన్నో పదవులు అలంకరించారని అన్నారు. పార్టీలో ఉన్న అత్యున్నత నేతల్లో వెంకయ్యనాయుడు ఒకరని చెప్పారు. కాగా, కేంద్ర మంత్రి పదవికి వెంకయ్యనాయుడు రాజీనామా చేయనున్నారు.