: పార్లమెంటులో ఓటు వేసిన ఎమ్మెల్యే అమిత్ షా!


రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తన ఓటు హక్కును పార్లమెంటులో వినియోగించుకున్నారు. ప్రధాని మోదీతో కలసి ఆయన పార్లమెంటులో ఓటు వేశారు. గుజరాత్ అసెంబ్లీలో అమిత్ షా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయనతో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు పార్లమెంటులో ఓటు వేశారు. ఇదే విధంగా 14 మంది రాజ్యసభ సభ్యులు, 41 మంది లోక్ సభ సభ్యులు తమ సొంత రాష్ట్రాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలంతా ఎన్నికల సంఘం ప్రత్యేక అనుమతితో పై విధంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. నలుగురు ఎమ్మెల్యేలకు వేరే రాష్ట్రాల్లో ఓటు వేసేందుకు ఎన్నికల కమిషన్ అనుమతిని ఇచ్చింది.

  • Loading...

More Telugu News