: శశికళ వీఐపీ ట్రీట్‌మెంట్ వివాదం: కర్ణాటక పోలీసు ఆఫీసర్ రూప బదిలీ
బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారని బయట పెట్టిన కర్ణాటక జైళ్ల డీజీ డి. రూపను ట్రాఫిక్ విభాగానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రూ. 2 కోట్ల లంచం తీసుకుని శశికళకు వీఐపీ సౌకర్యాలు కలిపిస్తున్నారని రూప మీడియాకు వెల్లడించిన నేపథ్యంలో పోలీసు శాఖ నియమాలను అతిక్రమించారంటూ కర్ణాటక ప్రభుత్వం ఆమెకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే!