: కమలహాసన్ ఇంటిని ముట్టడించిన శివసేన
చెన్నయ్ లోని విలక్షణ నటుడు కమలహాసన్ ఇంటిని శివసేన కార్యకర్తలు ముట్టడించేందుకు యత్నించడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కమల్ తలపెట్టిన 'బిగ్ బాస్'షో తమిళ సంస్కృతికి విరుద్ధమని, దీన్ని వెంటనే నిలిపివేయాలని తమిళనాడు శివసేన విభాగం కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ, కమల్ ఇంటివైపు దూసుకొచ్చారు. శివసేన కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం నెలకొంది. వెంటనే 'బిగ్ బాస్'ను నిలిపివేయకుంటే, అందులో పాల్గొంటున్న సెలబ్రిటీల ఇళ్లపై దాడులు చేస్తామని ఈ సందర్భంగా శివసేన నేతలు హెచ్చరించారు.