: ‘భళి భళి భళిరా భళి’ అంటూ ఇండోనేషియన్లు ‘బాహుబలి’ పాటను ఎలా పాడారో చూడండి!


‘భళి భళి భళిరా భళి... సాహోరే బాహుబలి. జయహారతి నీకే పట్టాలీ.. భువనాలన్నీ జై కొట్టాలి.. గగనాలే ఛత్రం పట్టాలి. హేస్స రుద్రస్స..’ అంటూ ‘బాహుబలి-2’ సినిమా పాటని విదేశీయులు కూడా పాడేస్తూ అల‌రిస్తున్నారు. ఇండోనేషియాకు చెందిన కొందరు యువకులు ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసుకుని బ్యాక్‌గ్రౌండ్‌లో ఒరిజినల్‌ పాట వస్తుంటే వారంతా లిరిక్స్‌కి తగ్గట్టుగా లిప్‌సింక్ చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. బాహుబ‌లి-2 అభిమానులు ఈ పాట‌ను విదేశీయుల నోట వింటూ హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. తెలుగువారి ప‌వ‌ర్ అలాంటిది మ‌రీ అని కామెంట్లు చేస్తున్నారు.       

  • Loading...

More Telugu News