సంక్రాంతికి పవన్ కల్యాణ్ కి ఎవరూ పోటీ లేనట్టే!
చిరంజీవి 'ఉయ్యాలవాడ' సినిమా పనుల్లో బిజీగా వున్నారు. ఇక వెంకటేశ్ .. నాగార్జున చేతుల్లో సంక్రాంతికి వచ్చే సినిమాలు లేవు. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ చేసే సినిమా సంక్రాంతికి రావొచ్చనే టాక్ వుంది. కానీ అది ఇంతవరకూ మొదలుకాకపోవడం వలన, సంక్రాంతి బరిలో ఉంటుందా? అనేది డౌటే. ఇక సుకుమార్ దర్శకత్వంలో చరణ్ చేస్తోన్న 'రంగస్థలం 1985' సంక్రాంతికి సిద్ధమైనా, పవన్ సినిమాకి పోటీగా రాకపోవచ్చని అంటున్నారు. అందువలన వచ్చే సంక్రాంతి సందడంతా పవన్ కల్యాణ్ దేనని చెప్పుకుంటున్నారు.