: ఫ్యాషన్ రంగంపై భారతీయ సూపర్ మోడల్ సంచలన వ్యాఖ్యలు!
ఫ్యాషన్ రంగం మొత్తం జాత్యహంకారం, సంపన్నులతో నిండిపోయిందని భారతీయ సంతతి బ్రిటిష్ సూపర్ మోడల్ నీలమ్ గిల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను మోడలింగ్ రంగంలో విజయవంతంగా కొనసాగుతుండడానికి కారణం తాను ధనవంతుల కుటుంబం నుంచి రావడమేనని ప్రజలు నమ్ముతున్నారని, ఈ విషయం తనకు కోపం తెప్పిస్తుంటుందని చెప్పింది. ఫ్యాషన్ రంగం నిండా జాత్యహంకారం, ధనవంతులే ఉన్నారన్న సంగతి వారికి తెలియదని అన్నారు. తాను బర్‌బెరీ కోసం మొదటిసారి మోడలింగ్ చేసినప్పుడు సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తాయన్నారు. తన తల్లిదండ్రులు ధనవంతులు కావడం వల్లే తనకీ అవకాశం వచ్చిందని చాలా మంది భావిస్తున్నారన్నారు. మోడల్స్‌పై వారికి అటువంటి అభిప్రాయాలు ఉన్నాయన్నారు.