: షర్మిలకు దిష్టి తీసిన రోజా!
వెల్లువలా తరలి వచ్చిన అశేషమైన వైకాపా కార్యకర్తలను ఉద్దేశించి వైఎస్ జగన్ సోదరి షర్మిల చేసిన ప్రసంగానికి ఆద్యంతం సభికుల నుంచి అనూహ్య స్పందన రాగా, ఆమె ప్రసంగం ముగిసిన వెంటనే, అక్కడే ఉన్న మహిళా నేత, ఎమ్మెల్యే రోజా దిష్టి తీశారు. ఆపై నుదుటన తిలకం దిద్ది, విజయమ్మకు అక్షింతలు ఇచ్చి, జగన్, షర్మిల నెత్తిన వేయించారు. అమరావతి సమీపంలోని నాగార్జున వర్శిటీ ఎదురుగా వైఎస్ఆర్ ప్రాంగణంలో ప్లీనరీ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి సుమారు 20 వేల మందికి పైగా కార్యకర్తలు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి హాజరు కాగా, పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. నేడు జాతీయ కమిటీ ఎన్నిక, ఆపై జగన్ ముగింపు ప్రసంగంతో ప్లీనరీ ముగియనుంది.