: హైదరాబాద్ ను డ్రగ్స్ కు కేంద్రంగా అభివర్ణిస్తుంటే బాధేస్తోంది: రావుల ఆవేదన
హైదరాబాద్ ను డ్రగ్స్ కు కేంద్రంగా అభివర్ణిస్తుంటే తనకు చాలా బాధేస్తోందని తెలంగాణ టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పలు రంగాల్లో దూసుకెళ్తూ అంతర్జాతీయ ఖ్యాతి గడించిన హైదరాబాద్ కు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువత సహా చిన్నపిల్లలు మొదలుకొని డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్నారని, ఈ సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కరించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.