: తన కొత్త సినిమా టీజర్ కు వస్తోన్న ఆదరణపై స్పందించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న 'జై లవ కుశ' సినిమా టీజర్‌ను నిన్న విడుదల చేసిన విషయం తెలిసిందే. కేవలం 24 గంటల్లోపే 70 లక్షల క్లిక్స్ సంపాదించుకున్న ఈ టీజర్‌కు వస్తోన్న స్పందనపై ఎన్టీఆర్ స్పందిస్తూ, హర్షం వ్యక్తం చేశాడు. ఈ టీజర్ పట్ల తన అభిమానులు, స్నేహితులు, సినీ ప్రముఖులు, మీడియా కనబరుస్తోన్న ఆదరణకు, ప్రేమకు తాను ఎంతో హర్షిస్తున్నానని పేర్కొన్నాడు. తన నుంచి ప్రేక్షకులు ఆశిస్తోన్న దానికి తగ్గట్లు మరింత కృషి చేస్తానని చెప్పాడు. చివరకు లవ్ యూ ఆల్ అని పేర్కొన్నాడు. జై లవ కుశ టీజర్లో జై పాత్రలో ఎన్టీఆర్ కనపడిన తీరు, వదిలిన డైలాగులకి విశేష స్పందన వస్తోంది. ఈ సినిమాపై ఆ టీజర్ అంచనాలను పెంచేసింది.